Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయండి

  • అధికారులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను వేగంగా గ్రౌండింగ్, బేస్మెంట్ లెవెల్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, బేస్మెంట్ లెవెల్ పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లు గ్రామ, మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం పై, వనమహోత్సవం కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 56.33% ఇండ్ల గ్రౌండింగ్ అయ్యాయని, 43% ఇంకా కావలసి ఉందని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జూన్ 25 వరకు ఎలాంటి ఇండ్లు పెండింగ్ లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అతి బీద కుటుంబం మహిళకు బ్యాంక్ లింక్ రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి అయిన 15 రోజులలో రెంటల్ లెవెల్ కు వెళ్లే విధంగా పనిచేయాలని తెలిపారు. ఈనెల 25 లోపు ఇంకా ప్రారంభించని ఇండ్ల జాబితాను రద్దుచేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు తక్కువ గ్రౌండ్ చూపించిన మొయినాబాద్, నార్సింగ్ ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల మున్సిపాలిటీల అధికారులను వెంటనే చేయించాలని లేనియెడల తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఇండ్ల నిర్మాణంలో ఇసుకకు సంబంధించి అందుబాటులో ఉన్న ఇసుకను ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామ మున్సిపల్ పరిధిలో ఈనెల 20 నుండి 28 వరకు పారిశుద్ధం పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైన్లు క్లీన్ చేయించి రోడ్లకు ఇరువైపుల పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తాగునీరు కలుషితం కాకుండా లీకేజీ లేకుండా చూడాలని గ్రామపంచాయతీ మున్సిపల్ లలో అన్ని గుంతలు కల్వర్టులు పూడ్చాలని గ్రామాలలో వీధి దీపాలు లేని ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని ఈ విషయంపై పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీన్ని పరిశీలించుటకు జులై 1 2 3 తేదీల్లో గ్రామాలకు మున్సిపాలిటీలకు ఆడిట్ టీమ్లు సందర్శించి పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ డ్రైవ్ లో సరిగా పని చేయని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. వన మహోత్సవం పై కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పని చేయాలని సూచించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని, గుంతలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మొక్కలు నర్సీలలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి రామారావు, డిపిఓ సురేష్ మోహన్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి కేషురామ్, పిడి హౌసింగ్ హనుమంతు నాయక్, గ్రామీణ అభివృద్ధి శాఖ పిడి శ్రీలత మెప్మా పిడి మల్లీశ్వరి, డిఈఓ సుశీందర్రావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.