Take a fresh look at your lifestyle.

చెంచుల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: ఎంపీ డాక్టర్ మల్లురవి

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : ప్రజా చెంచుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని అందులో భాగంగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకానికి రూ.12, 600 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు.గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి క్యాంపు కార్యాలయంలో సమావేశం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గిరి జల వికాసం పథకానికి రూ 12,600 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజనుల పోడు భూములు సాగు కు చేయూత‌ నివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాని ప్రారంభిస్తుందని అన్నారు. ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాని ప్రారంభించనున్నట్లు తెలిపారు.రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ‌ రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు 6000 కోట్లు కేటాయించిందని అన్నారు. యువతను బారాస ప్రభుత్వం పట్టించుకోలేదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజు జూన్ రెండున ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తామని తెలిపారు. బ్యాంక్ క్రెడిట్ స్కోర్ తో సంబంధం లేకుండా పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు.టిఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాలుకు రూ 500 బోనస్ ఇచ్చిందని తెలిపారు.కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు ఆనంద్ కుమార్ ,భూపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రాములు, శ్రీకాంత్ రెడ్డి, రాహుల్, దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.