కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గురువారం రోజు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవంను గండ్ర కేశవరావు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఉదయం కలశాభిషేకం, నవగ్రహ, సూర్య, ఆదిదేవతలతో పాటు, అభయాంజనేయ స్వామి వారికి అర్చనలు, ఫల పంచామృతాలతో అభిషేకాలను అర్చకులు నారంభట్ల భరద్వాజ వైదిక నిర్వహణలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రఘు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్, రుద్ర శ్రీనివాస్, యాదగిరి బాబు, పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమానంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా ఉత్సవానికి సహకరించిన గండ్ర కేశవరావు, రజిత, రాణిల కు ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ శాలువతో సత్కరించారు.గ్రామ మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య, ఆలయ కమిటీ, ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమoలో గ్రామ కార్యదర్శి సరిత, ప్రత్యేక అధికారి సుచరిత్, కోటగిరి రామ్, కే. శేఖర్, మల్లయ్య, కిషన్, రాకేష్, కోటగిరి భూమయ్య, కిషన్, సల్ల మధు, శ్రీజ, శైలజ, జగన్ తదితరులు పాల్గొన్నారు.
