Take a fresh look at your lifestyle.

భవన నిర్మాణ కార్మికుల కు విదేశాల్లో ఉపాధి అవకాశాలు * అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్

 

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :

సిద్దిపేట జిల్లా పరిధిలోని భవన నిర్మాణ రంగాల కార్మికులకు విదేశాల్లో ఉపాధి అవకాశం కల్పించే ప్రత్యేక ప్రణాళిక కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నాం అని అవకాశం ని భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్ తెలియజేశారు. జిల్లాలో వున్నా కార్మిక సంఘాల నాయకులతో సిద్దిపేట కార్మిక శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ACL మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 10,000/ మంది భవన నిర్మాణ కార్మికుల ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు.న్యాక్ సహకారం తో నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.నిర్మాణ రంగంలో సంవత్సరంలో 90 రోజులు పని చేసిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడు వెల్పేర్ బోర్డు లో పేరు నమోదు చేసుకోవాలన్నారు . తద్వారా సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే పథకాలు ఉపయోగించుకోవాలని కోరారు. PM-SYM స్కీమ్ లో ప్రతి కార్మికుడు పేరు నమోదు చేసుకొని 60 సంవత్సరాలు తర్వాత 3,000/ పెన్షన్ సౌకర్యం పొందాలని కోరారు. కార్మికుల సంక్షేమ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అములు చేస్తుందన్నారుఈ కార్యక్రమం లో ALO వికర్ బాబా, జూనియర్ అసిస్టెంట్ దివ్య, దాసు, కార్మిక సంఘాలు నాయకులు పాల్గున్నారు.

Leave A Reply

Your email address will not be published.