ముద్ర కాప్రా
లంచం తీసుకుంటున్న గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్,హోంగార్డ్ నగేష్‌ను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రంగసాని శ్రీధర్ తెలిపారు. కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించి హోంగార్డ్ నగేష్‌తోపాటు డాక్టర్ నగేష్ ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు.మృతుడు తోటకూర మహేష్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ అందించాలంటే మొదట రూ.2 లక్షలు ఇవ్వాలని నగేష్ డిమాండ్ చేసినట్లు మృతుడి మేనల్లుడు శరత్ ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్ పేరు చెప్పి రిపోర్ట్ త్వరగా తెప్పించాలంటే డబ్బులు అవసరమని నమ్మబలికినట్లు తెలిపారు.నెలలు గడిచినా రిపోర్ట్ అందకపోవడంతో చివరకు రూ.40 వేలుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొదట రూ.5 వేలు తీసుకున్న నగేష్, రెండో విడతగా రూ.35 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.