Take a fresh look at your lifestyle.

రికార్డు స్ధాయిలో ధాన్యం కొంటాం-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రబీ సీజన్ లో 90 లక్షల మె.ట ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు
54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
రాష్ట్ర వ్యాప్తంగా 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
గ్రేడ్-ఏ కు క్వింటాల్ కు 2,389 మద్దతు ధర ఇచ్చేందుకు నిర్ణయం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

2025-26 రబీ సీజన్ లో ముందెన్నడూ లేని రీతిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రబి సీజన్లో54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ,కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లపై సోమవారం ఉదయం బేగంపేట లోని ఐ.ఏ.ఎస్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలసి అదనపు కలెక్టర్లు,జిల్లా పౌర సరఫరాల శాఖాధికారులు, ఆయా జిల్లాల సివిల్ సప్లయ్స్ మేనేజర్లతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో ఉత్పత్తి అయిన ధాన్యం దిగుబడిలో వ్యవసాయ రంగ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సమగ్రమైన కార్యాచరణను రూపొందించామని చెప్పారు. అందులో 60 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం,30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నాలు ఉంటాయన్నారు. ధాన్యం కొనుగోలులో రైతాంగానికి ఎక్కడా అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు ధాన్యం ఉత్పత్తికి తగ్గట్టు రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. చదానికి తోడు కొనుగోలు కేంద్రాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రప్రభుత్వం నిర్ణయానుసరంగా మద్ధతు ధర చెల్లించేందుజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గ్రేడ్-ఏ,సాదారణ విభాగలుగా గుర్తించి గ్రేడ్-ఏ కూ2,389,సాధారణ వరికి 2,369 చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగాపెరిగిన మద్ధతు ధరతో రైతాంగానికి పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతుందని మంత్రి చెప్పారు. తద్వారా రైతాంగానికి ఆదాయం పెరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాలను పెంచడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో టార్భాలిన్ షీట్లు,ఎలక్ట్రానిక్ తుకాలు,తేమను కొలిచే పరికరాలు, ఆటోమేటిక్ వరి క్లినర్లు,డిజిటల్ డయల్ కాలిపర్స్, హస్క్ రిమువర్ల తో పాటు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు సత్వరం ధాన్యాన్ని సరఫరా చేసేందుకు సరిపడా వాహనలా ఏర్పాట్లను ముందుగానే చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దానికి తోడు వేసవి తీవ్రత ను దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి ఎక్కడ ఇబ్బందులు ఎదురు కాకుండా చూడడంతో పాటు ఎండ వేడిమికి వడ దెబ్బ తగలకుండా నివారణ చర్యల నిమిత్తం తక్షణ ఉపశమనం కోసం ఓ.ఆర్.ఎస్ వంటివి ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంట పంటకు దిగుబడి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి పెరుగుతుందని ఖరీఫ్ సీజన్ కు తాజా రబీ సీజన్ కే ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.