Take a fresh look at your lifestyle.

ఎన్నికలు ప్రశాంతగా నిర్వహించాలి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి :

మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా,నిష్పక్షపాతంగాజరగాలని,ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం దురదృష్టకరమని బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి లోని 23వార్డు బూతు నంబర్ ఒకటి లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్,కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన సంఘటనలు కళ్ళముందు జరిగాయని, సోలీపూర్, సవాయి గూడెంలో జరిగిందన్నారు .ప్రజల అభీష్టం అనేది ప్రలోభాలకు అతీతంగా నిర్భయంగా,నిష్పాక్షికంగా వెల్లడి కావాలన్నది ఎన్నికల నియమావళి యొక్క ఉద్దేశమన్నారు.

Leave A Reply

Your email address will not be published.