బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కోప్ స్వచ్ఛంద సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుబడి, బాలల హక్కుల పరిరక్షణ దిశగా ఒక కీలక ముందడుగు వేస్తూ “బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం” నిర్వహించబడిందన్నారు. సమాజంలో బాల్య వివాహాలపై అవగాహన పెంపొందించడం, బాలికల విద్య మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, చట్టపరమైన చర్యలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం లక్ష్యంగా నిర్వహించబడుతోందని బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ప్రచార రథం ద్వారా గ్రామాలు, మండలాలు, పాఠశాలలు, కాలేజీలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు , బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి , స్కోప్ కోఆర్డినేటర్ సోమ నరసయ్య ,సిడబ్ల్యూ సి మెంబర్ శివరాజ్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ దశరథ, హబ్ కో ఆర్డినేటర్ హర్ష, సీనియర్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్కోప్ సంస్థ ప్రతినిధులు నరసింహారాజు, అశ్విని, వెంకటేష్ , బాల రక్ష పాల్గొన్నారు.