Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పాలనలో రైతుల కంట కన్నీరు

  • సాగునీరు అందించక రైతులను అరిగొస పెడుతున్న రేవంత్ సర్కార్.
  • కన్నెపల్లి పంప్ హౌజ్ నీటిని ఎత్తిపోసి పంటపోలాలకు సాగునీరు అందించాలి.
  • దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేకు పూర్తి మద్దతు.
  • రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: కాంగ్రెస్ పాలనలో పంటపోలాలకు సాగునీరు అందక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రేవంత్ సర్కార్ రైతులను అరిగొస పెడుతూ వారి కళ్లలో కన్నీరు నింపుతున్నారని కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి నీళ్లను ఎత్తిపోసి పంటపోలాలకు సాగునీరు అందించాలని లేదంటే నీల్ల కోసం మరో ఉద్యమం చేస్తామని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ హెచ్చరించారు.సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు.కేసీఆర్‌ ప్రభుత్వ హాయంలో ఎంతగొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో రెండు ఫిలర్లు కుంగయని సాకుచూపి ఇప్పటికీ వరకు ఎలాంటి మరమత్తులుచేయడంలేదన్నారు.కేవలం కేసీఆర్‌ ను బాదనాం చేయాడానికే బిఆర్ఎస్ పార్టీ పై బురదచల్లడానికి రైతులకు సాగునీరు అందించక ఇబ్బందులు పెడుతున్నరని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి పంపింగ్ మెదలుపెట్టి సుందిళ్ల అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని లేదంటే మరోఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి సంస్దను పైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తున్నరని, ఈ నెల 9 న కార్మిక సంఘాల జె.ఎ.సి తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేకు బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ విలేఖరుల సమావేశం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోపు అయులయ్య యాదవ్,నడిపెల్లి మురళీధర్ రావు,బోడ్డు రవీందర్ నారాయణదాసు మారుతి,నీరటి శ్రీనివాస్,పిల్లి రమేష్,దేవరాజ్, నూతి తిరుపతి,సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.