Take a fresh look at your lifestyle.

హుజూర్నగర్ రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

 

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.
మంగళవారం హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోనీ రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, గ్రీనరీ, త్రాగునీరు, పైలాన్ స్తూపం స్థలాన్ని పరిశీలించి మిగిలి పోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హత లేని వారికి ఈ జాబితాలో పేరు ఉండకూడదని అని స్పష్టం చేశారు. అత్యంత అర్హులైన నిరుపేదలకు ప్రాధాన్యం ఇచ్చి, సూక్ష్మంగా పరిశీలించి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హర్టికల్చర్ పిడి నాగయ్య, తహసిల్దార్ కవిత, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.