పంచాయితీ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలి – సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి డిమాండ్
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నుండి ఆరు నెలల వరకు పెండింగ్లో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా అధికారులకు డిమాండ్ చేశారు. నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులు గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నారనియని అన్నారు.తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కార్మిక, కర్షక భవన్ లో జిల్లా అధ్యక్షులు అమ్ముల బాలనర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి హాజరై మాట్లాడుతూ గత 140 సంవత్సరాల క్రితం కార్మికుల హక్కుల కోసం పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కేంద్ర కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడలుగా విభజించి నూతన చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. నూతన చుట్టాలు అమలు అయితే కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని తమహక్కుల కోసం సమ్మె చేసే హక్కును కోల్పోతారని ప్రస్తుతం 8 గంటల పనిని 12 గంటలకు పెంచే విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులకు తీవ్రమైన నష్టాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి పాత చట్టాలు కొనసాగించాలని అన్నారు. కనీస వేతనాలు 26000 రూపాయలుఅమలు చేయాలని పీఎఫ్ ఈఎస్ఐ చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లను ప్రత్యేక స్టేటస్ కల్పించి కొనసాగించాలని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పంచాయతీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల వలే గ్రీన్ చలాన్ ద్వారా వేతనాలు చెల్లి స్థానన్ని హామీని అమలు చేయాలని రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేష్,కోశాధికారి చిట్యాల కనకయ్య, ఉపాధ్యక్షులు ప్రభాకర్, కొమురయ్య, మహిళా నాయకురాలు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.