Take a fresh look at your lifestyle.

వరి ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయండి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

ప్రభుత్వ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగ వంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.బుదవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, సంగునూరు మండలం ముండ్రాయి గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతుందని ఏఏంసి లలో మాత్రమే మక్కల కొనుగోలు సైతం వేగంగా కొనసాగుతుందని తెలిపారు.
తేమ శాతం వచ్చి లిఫ్ట్ చెయ్యడానికి తయారుగా ఉన్న ధాన్యాన్ని లారీలు వచ్చే వరకు ఆగకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్ ఇతరత్ర వాహనాలలో ధాన్యాన్ని నింపి మిల్లులకు తరలించాలని ఆదేశించారు.అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు టెంట్, కుండలో తాగునీరు, తాలు తీసే యంత్రాలు, వేయింగ్ మిషన్స్, టార్పాలిన్ కవర్లు, సుతిల్ దారాలు, గన్ని బ్యాగులు ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని సెంటర్ లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మిల్లులో దిగుమతిలో జాప్యం జరగకుండా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.