మోత్కూర్ ముద్ర న్యూస్: మున్సిపాలిటీ లోని రాజన్న గూడెం గ్రామం మాజీ కౌన్సిలర్ వనం స్వామి వారి తండ్రి వనం చిన్న రాములు ఆదివారం మరణించడంతో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి, మోత్కూర్ మున్సిపాలిటీ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు.మృతుని కుటుంబానికి మోత్కూర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య ఆర్థిక సాయంగా ఐదు వేల రూపాయలు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, బొల్లెపల్లి వెంకటయ్య, బద్దం నాగార్జున రెడ్డి మరియు గ్రామస్తులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.