- గడ్డి అన్నారం మార్కెట్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి
ముద్ర, ఇబ్రహీంపట్నం: గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి అన్ని విధాలా ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకొని మరింత ఆదాయం సమకూరుస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించి 2025 -26 కి సంబంధించిన బడ్జెట్ ను ఆమోదించి,ప్రతిపాదనలను తీర్మానం చేసి అధికారులకు పంపించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కు ఆమోదముద్ర వేసి ప్రతిపాదనలను పై అధికారులకు పంపించామని అన్నారు.గడ్డి అన్నారం మార్కెట్ ను మరింత లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.వచ్చే మామిడి సీజన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని,కనీస సదుపాయాలు కల్పిస్తామని,ఇప్పటికే అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతులకు వర్తకులకు సమన్వయము ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు.కోహెడ మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని,ప్రాజెక్ట్ డీపీఆర్ ఇప్పటికే పూర్తి అయ్యిందని పాలన పరంగా అనుమతులు రాగానే శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బాస్కర చారి,మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, పాలకవర్గం సభ్యులు బండి మధుసూదన్ రావు, రఘుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి, అంజయ్య లక్ష్మి,నరసింహ, గోవర్ధన్ రెడ్డి,నవరాజ్,గణేశ్ నాయక్, మచ్చెందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా,ఇబ్రహీం,మార్కెట్ కమిటీ అధికారులు హర్ష, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
