ముద్ర, మల్యాల : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు (త్రయాహ్నికము) నిర్వహించనున్నారు.ఈ నెల 10 నుంచి 13 వరకు మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలకు యాగశాల ముస్తాబు చేస్తున్నారు.పవిత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ప్రతిరోజు సాయంత్రం సామూహిక భజన, రామనామ సంకీర్తన నిర్వహించనున్నట్లు తెలిపారు.