జిల్లా ఆస్పత్రి వేరేచోటకు మార్చి రోగుల పాలిట శాపంగా మారింది
4 వ వార్డు ప్రచారంలో కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్
ముద్ర, నారాయణపేట: జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిని 12 కిలోమీటర్ల సుదూరంలో ఉన్న ప్రాంతానికి తరలించి జిల్లా కేంద్రంలో ఉన్న రోగుల పాలిట కాంగ్రెస్ శాపంగా మారిందని 4 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హామీలు తప్ప అభివృద్ధి శూన్యం అన్నారు. కాంగ్రెస్ లో అసలు ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. బిజెపి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు మాత్రమే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

10 వ వార్డులో బీజేపీ గెలుపు కోసం కృషి చేద్దాం
కౌన్సిలర్ అభ్యర్థి సిద్ది విశాలాక్షి వెంకట్రాములు
నారాయణపేట మున్సిపాలిటీ పరిధి పదో వార్డులో అఖండ మెజార్టీతో బిజెపి గెలుపు కోసం కృషి చేద్దామని కౌన్సిలర్ అభ్యర్థి సిద్ది విశాలాక్షి వెంకట్ రాములు అన్నారు. బిజెపి నాయకులు నాగురావు నామాజీ, వార్డు ఇంచార్జ్ జ్యోతి సాయిబన్న ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వివరించారు. సన్న బియ్యం వంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని ఓటర్లకు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

21వ వార్డులో బిజెపి ముమ్మర ప్రచారం…
పట్టణంలోని 21 వ వార్డులో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి కమలాపూర్ ప్రభాకర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన వార్డు బిజెపికి కంచుకోట అని పేర్కొన్నారు. వార్డులో తమ సామాజిక వర్గ ఓటర్లు పూర్తిస్థాయిలో తనకు మద్దతుగా నిలుస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

16 వార్డులో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తా
పట్టణంలోని 16వ వార్డులో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని కౌన్సిలర్ అభ్యర్థి కమలాపూర్ అంబికా శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇంటింటికీ తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లతో కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన చేసిన అభివృద్ధి ఏమీ లేదని…. మోసపూరిత హామీలు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం మన్నారు. బిజెపి ద్వారానే పట్టణం, వార్డ్ అభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ రూ. 100 కోట్లు తీసుకు వస్తామని హామీ ఇవ్వడం అందని ద్రాక్ష అన్నట్టే అని ఆరోపించారు.

1 వ వార్డులో దూసుకుపోతున్న కమలం
వార్డులో ముమ్మరంగా కౌన్సిలర్ అభ్యర్థి సుతారి సత్య రఘుపాల్ ఇంటింటి ప్రచారం
నారాయణపేట పట్టణంలోని ఒకటో వార్డులో బిజెపి దూసుకుపోతుంది. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సుతారి సత్య రఘుపాల్ ఇంటింటి ప్రచారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. నారాయణపేటలో బిజెపి మున్సిపల్ హయాంలోనే వార్డులలో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హామీలు తప్ప అమలు లేదని పేర్కొన్నారు. తాను కౌన్సిలర్ గా గెలుపొందిన తర్వాత ఎంపీ డీకే అరుణ నిధుల నుంచి వార్డుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలు ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.