Take a fresh look at your lifestyle.

3 వ వార్డులో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దాం – కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ

 

ముద్ర, నారాయణ పేట:

నారాయణపేట మున్సిపాలిటీ పరిధి 3 వ వార్డులో అఖండ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దామని కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ అన్నారు. శుక్రవారం 3 వ వార్డు పరిధిలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వివరించారు. ఉచిత కరెంటు, మహిళలకు ఫ్రీ బస్సు, దఫాలుగా ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తున్న ఘనత ఒక్కసారి ఓటర్లు ఆలోచించే ఓటు వేయాలన్నారు. గత పదేళ్లలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని ఓటర్లకు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.