Take a fresh look at your lifestyle.

కాలేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చారు-కెసిఆర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

కాలేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చారు -కాలేశ్వరం డబ్బులతో ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు

-ఫోన్ టాపింగులతో భార్యాభర్తల సంభాషణ విన్నారు

-మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఏం చేశారు

-పాలమూరు రంగారెడ్డిని వదిలి రాయలసీమ నీరిస్తారంట

-కెసిఆర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

కాలేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మార్చి జనాలు డబ్బులు దోచుకున్నారని ఎర్రబల్లిలో వేయి గజాల 1000 ఎకరాల్లో ఫామ్ హౌజ్ నిర్మించుకున్నారని కేటీఆర్ జొన్వావాడలో, హరీష్ రావుకు మొయినాబాద్ లో ఫామ్ హౌజ్ లు నిర్మించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పరిగి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రాణహిత చేవెళ్లను నిలిపివేసి మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ తదితర ప్రాజెక్టులకు నీళ్లు మళ్లించుకున్నారని గోదావరి జలాలు 3000 టీఎంసీలు సముద్రంలో కరుస్తున్నాయని అందులో నుంచి 300 టీఎంసీలు ఇచ్చిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందని తాగు సాగునీరు అందుతుందని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక్క రూపాయి కూడా వికారాబాద్ జిల్లాకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. -మున్సిపల్ శాఖ మంత్రిగా రంజిత్ రెడ్డి మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తామని వెల్లడించిన సిఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనుభవం, విజన్ ఉన్న నాయకుడిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ప్రశంసించిన సిఎం. రంజిత్ రెడ్డి లాంటి నాయకులు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపడితే అభివృద్ధి మరింత వేగంగాచెందుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.