Take a fresh look at your lifestyle.

ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలంపియాడులో రాణించిన జీనియస్ విద్యార్థులు

ముద్ర, భువనగిరి ప్రతినిధి :

పట్టణంలోని జీనియస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 12 నవంబర్ 2025న అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడు పోటీ పరీక్షల్లో పాఠశాలకు చెందిన 323 మంది విద్యార్థులు హాజరు కాగా ఇటీవల ప్రకటించిన ఇట్టి ఫలితాలలో 43 మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిర్వాహకులు అందజేసిన బంగారు పతకాలు ప్రశంసా పత్రాలు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి, డైరెక్టర్ తోట శ్రీధర్ విద్యార్థులకు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి స్వర్ణలత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.