Take a fresh look at your lifestyle.

వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ

 

ముద్ర, గద్వాల: గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతు – శాస్త్రవేత్త చర్చ మరియు శిక్షణ కార్యక్రమము (ATMA సౌజన్యంతో) నిర్వహించారు.
ఈ కార్యక్రమములో తెలంగాణ రైత విజ్ఞాన కేంద్రం, మహబూబ్ నగర్ శాఖ డాక్టర్ అర్చన మేలైన పంటలు పత్తి, మిరప, కంది, మొక్కజొన్న తదితర పంటల పై వచ్చే తెగుళ్లు, చీడ పీడల గురించి, వాటి నివారణ గురించి రైతులతో చర్చించారు. పంటల పై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి పరచారు. ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు ‌డైరెక్టర్ జగ్గునాయక్ ప్రకృతి వ్యవసాయం గురించి, పంటలపై ఇష్టానుసారంగా పురుగు మందులను రైతులు వాడుతున్నారని, దీని వల్ల కాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయని, రైతులు పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వేప నూనెలను పంటలకు విరివిగా వాడాలని తెలిపారు.
ఈ కార్యక్రమములో ఎడిఎ సంగీత లక్ష్మీ, గ్రామ సర్పంచ్ క్రిష్ణారెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి నారాయణ, మండల వ్యవసాయాధికారి…ప్రతాప్ కుమార్, ఎఇఓ అనుషా, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.