Take a fresh look at your lifestyle.

క్యాన్సర్ అంటే భయం వద్దు

 

ముద్ర, తాండూర్ :
క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన పనిలేదని, ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, కిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ నిపుణులు డా. మధు దేవర శెట్టి అన్నారు.ఆదివారం తాండూరు పట్టణంలోని సాయితరుణ్ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షులు డా. జయప్రసాద్ ఆధ్వర్యంలో, కిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, వైద్యులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 350 మందికి పైగా ప్రజలు హాజరై వివిధ పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో మొత్తం 14 మంది వైద్యులు సేవలు అందించారు.150 మందికి పైగా రక్తపరీక్షలు, 63 మందికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, 12 మందికి మమోగ్రఫీ, 8 మందికి ఎండోస్కోపీ, 69 మందికి ఎక్స్‌రే, 63 మందికి క్యాన్సర్ ప్రత్యేక పరీక్షలు, 53 మందికి పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించారు. మిగతా వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం కొనసాగింది.

Leave A Reply

Your email address will not be published.