Take a fresh look at your lifestyle.

స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో గురువారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారని ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూరమంగళ హారతులు సమర్పించారు. అన్న ప్రసాద వితరణలో భాగంగా గురువారం సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
శ్రీ స్వామి వారిని దర్శించుకున్న అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక సంఘం జాతీయ ఛైర్మన్, మాజీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనిందర్‌జీత్ సింగ్ బిట్టా
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంకు ప్రముఖ సామాజిక నాయకుడు, అఖిల భారత జాతీయ ఛైర్మన్, మాజీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనిందర్‌జీత్ సింగ్ బిట్టా ఉగ్రవాద వ్యతిరేక సంఘం జాతీయ ఛైర్మన్, మాజీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనిందర్‌జీత్ సింగ్ బిట్టా విచ్చేసి శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి, వేదాశీర్వచనాలతో సత్కరించారు. అనంతరం ఆయన ఆలయ మహాద్వారం, ప్రధాన గర్భాలయం, ఉప ఆలయాలు, యాగశాల, గోశాల, తీర్థ ప్రదేశాలు తదితర పవిత్ర స్థలాలను సందర్శించి క్షేత్ర వైభవాన్ని ఆస్వాదించారు. అలాగే క్షేత్రంలోని దివ్య జలనారాయణ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా ప్రార్థనలు సమర్పించారు.
భూలోక వైకుంఠంగా పేరుపొందుతున్న స్వర్ణగిరి క్షేత్ర నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక వాతావరణం, నిత్య కైంకర్యాలు మరియు వైష్ణవ ఆగమ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించబడుతున్న సేవలను చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో ధార్మిక చైతన్యం, సంస్కృతి పరిరక్షణలో ఇటువంటి దివ్యక్షేత్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.