ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నందున విద్యార్థులను బడిలో చేర్పించాలని
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం భువనగిరి మండలం అనంతారం ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి మెగా పీటీమ్ ) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులను చేర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యా వారోత్సవాలలో భాగంగా పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను,100 శాతం హాజరు నమోదు చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పి.మదన్మోహన్ బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి(మెగా పీటీమ్ )ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారాన్ని అందించడంతో పాటు, ఇంటర్మీడియట్ వరకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించనున్నదని ఆయన అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కందుల సత్యనారాయణ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ఉన్నత పాఠశాలలో పాల్గొని ఉత్తమ ఫలితాలు వస్తున్న ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులు,ప్రజా ప్రతినిధులను కోరారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మెగా పీటీమ్ లలో అధికారులు, ప్రజా ప్రతినిధులు,జిల్లా సెక్టోరియల్ అధికారులు పెసరు లింగారెడ్డి, షేక్ జానీ ఆఫ్ఘన్, సీ.హెచ్.రాధ, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.