Take a fresh look at your lifestyle.

నలుగురు అధికారుల సస్పెండ్

ముద్ర ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………..
సోమవారం రాత్రి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి లో పోస్టుమార్టం గది లో ఓ శవాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటనలో నలుగురు వైద్య అధికారుల పై వేటు పడింది.ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్ అజయ్ కుమార్ ఈ ఘటన పై మంగళవారం విచారణ చేపట్టి భాద్యులైన ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, ఎంఎన్ఓ రవి ప్రకాష్,డ్యూటీ డాక్టర్ మునిషా లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అందరిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించి ఆసుపత్రి లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది అందరి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధుల పై సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కువైందని, ఇలాంటి వారి పై కఠినంగా వ్యవహరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.