Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలపై కేంద్ర కమిటీ సమావేశం

తొలిభేటీ ఓకే..

నీటి హక్కు వాదనను బలంగా వినిపించిన రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ
కమిటీ ముందుకు 12అంశాలు
న్యూఢిల్లీలో రెండుగంటల పాటు చర్చలు
రెండో భేటీపై ఉత్కంఠ
హాజరైన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎన్ డబ్ల్యూడీఏ ఛైర్మన్లు. ఉన్నతాధికారులు

న్యూఢిల్లీ :

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం శుక్రవారం సాదాసీదాగా ముగిసింది. న్యూఢిల్లీలోని కేంద్ర జలసంఘం (సీడ్లూసీ) కార్యాలయంలో జలసంఘం ఛైర్మన్‌ అధ్యక్షతన దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులు, కృష్ణా నది యాజమాన్య మండలి (కేఆర్ఎంబీ), గోదావరి నది యాజమాన్య మండలి (జీఆర్ఎంబీ), నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్ డబ్ల్యూడీఏ) ఛైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్‌, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ అక్కడి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తరఫున 12 అంశాలను చర్చకు ప్రతిపాదించినట్లు తెలిపారు. పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులను అజెండాలో చేర్చవద్దని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి అనేక సమస్యలు, వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తన అజెండాను వెల్లడించలేదని రాహుల్ బొజ్జ తెలిపారు. తదుపరి సమావేశం నిర్వహణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వివాదాల పరిష్కారంపై అధికారుల కమిటీ తొలిసారి భేటీ కావడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.