Take a fresh look at your lifestyle.

ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలి సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్:
అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలని
సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం
కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
నర్సమ్మ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు నిర్ణయం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదు. పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్సపోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. వీటికి తోడు పారితోషికాలు కూడా ప్రతి నెలా రావటం లేదు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వీటన్నింటినీ పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెంచాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు.


ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శ్యామల, నాయకులు రాణి, దేవమ్మ, నిర్మల, గోపమ్మ, రేణుక, దుర్గా, చంద్రకళ, సంగమేశ్వరీ, కవితా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.