- పేటలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.
- 18వ వార్డు సాయిమందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదానం.
- సమాజంలో ప్రతి ఒక్కరు భక్తి భావంతో ఉండి ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని సుధాకర్ పివిసి అధినేత మీలా మహదేవ్, జయ స్కూల్ కరస్పాండెంట్ జయ వేణుగోపాల్*ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుంది : సుధాకర్ పివిసి అధినేత మీలా మహదేవ్.
- పేటలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.
- 18వ వార్డు సాయిమందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదానం.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: సమాజంలో ప్రతి ఒక్కరు భక్తి భావంతో ఉండి ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని సుధాకర్ పివిసి అధినేత మీలా మహదేవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 18వ వార్డు సాయి మందిరంలో మందిర కమిటీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మాలోతు కమలా చంద్రునాయక్ ఆధ్వర్యంలో సాయిబాబాకు కాగడ హరతి, సుప్రభాతం, హారతి, అభిషేకం, అన్నదానం, పల్లకిసేవ తదితర కార్యక్రమాలను నిర్వహించగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. 18వ వార్డు సాయి మందిరంలో పెద్ద ఎత్తున గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలు కుంభం వెంకటేశ్వర్లు ప్రేమలత, అరుణమ్మ, శకుంతల, సత్తిరెడ్డి, వేణుగోపాల్, పిచ్చమ్మలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 18వ వార్డు సాయి మందిరంలో మందిర కమిటీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మాలోతు కమలా చంద్రునాయక్ ఆధ్వర్యంలో సాయిబాబాకు కాగడ హరతి, సుప్రభాతం, హారతి, అభిషేకం, అన్నదానం, పల్లకిసేవ తదితర కార్యక్రమాలను నిర్వహించగా అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. 18వ వార్డు సాయి మందిరంలో పెద్ద ఎత్తున గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలు కుంభం వెంకటేశ్వర్లు ప్రేమలత, అరుణమ్మ, శకుంతల, సత్తిరెడ్డి, పిచ్చమ్మలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.