Take a fresh look at your lifestyle.

ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో నిర్మల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు

  • మహిళా సాధికారతలో ఆదర్శం.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇందిరా మహిళా శక్తి సంబరాలలో నిర్మల్ జిల్లా మహిళలు సాధికారతలో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు. హైదరాబాద్‌ మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు గుర్తింపు లభించింది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల సాధికారతలో నిర్మల్ జిల్లా రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. బ్యాంకు లింకేజీ, రుణాల వితరణ, వసూలు వంటి అంశాల్లో నిర్మల్ జిల్లా అగ్రగామిగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లా మహిళా సంఘాలు నిర్మల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్ని నిర్మల్ జిల్లా మహిళలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు.సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ మాట్లాడుతూ నిర్మల్ మహిళా సంఘాలు అన్ని రకాల రుణాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందు తున్నాయన్నారు. బ్యాంకు లింకేజీ, రుణాల వితరణ, వసూలు లలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారన్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా సాధించారని పేర్కొన్నారు. ఈ వేడుకలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, మహిళా సంఘాల బృందాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.