Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కారించాలని ఎమ్మెల్యేకు వినతి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఎంప్లాయిస్ గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఎంప్లాయిస్ గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, మరియు పెన్షనర్స్ వారి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 57 అంశాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ మంత్రుల కమిటీ, అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మిరియాల నాగేందర్ రెడ్డి, కన్వీనర్ కందుకూరి రవిబాబు, సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.