Take a fresh look at your lifestyle.

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే నా లక్ష్యం.

వికారాబాద్, ముద్ర విలేఖరి : వికారాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే నా లక్ష్యం అని జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకుడు డాక్టర్ టి ఆనంద్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను ప్రజలకు సక్రమంగా అందించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనకు నేరుగా సంప్రదించాలని పర్యవేక్షించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.