- మళ్లీ కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలంటూన పోలీసులు
ముద్ర.వీపనగండ్ల :- ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, ఏక్కడ నేరాలు జరిగిన, రోడ్డు ప్రమాదాలు జరిగిన సీసీ కెమెరాలు లో రికార్డు అయి ఉంటే సులభంగా గుర్తించటానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే మండల కేంద్రమైన వీపనగండ్లలో సుమారు మూడు సంవత్సరాల క్రితం పోలీసులు, దాతల సహకారంతో గ్రామంలోని ప్రధాన రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లో కంట్రోలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయటంతో ప్రజలు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ఉండేవారు. అక్రమంగా ఇసుక ట్రాక్టర్లు కూడా గ్రామంలోకి రావాలంటే భయపడేవారు. దొంగతనాలు కూడా జరిగేవి కావు.సీసీ కెమెరాలు ఏర్పాటులో నాణ్యత లేకపోవడం, వైర్లను వానరాలు తెంపివేయటంతో కొద్ది రోజులకే వాటి నిర్వహణను కూడా పోలీసులు గాలికి వదిలేశారు.
దాతలు సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన పోలీసులు నాణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంతో కొన్ని రోజులకే అవి పనికి రాకుండా పోయాయని, మళ్లీ వాటి స్థానంలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటానికి దాతలు ముందుకు రావాలని పోలీసులు కోరడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి, గతంలోనే తాము ఇచ్చిన డబ్బులకు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటే ఇంత త్వరగా పాడైపోయేవి కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకోవడం మంచి ఉద్దేశమే కానీ గతంలోనే నాణ్యమైన తెచ్చి ఉంటే బాగుండేది కదా అని ప్రజలు అంటున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి తీసుకున్నా వస్తువులకు షాపు వాళ్ళు గ్యారెంటీ ఇస్తుంటారు కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు గ్యారెంటీ ఇచ్చారో లేదో కూడా తెలియడం లేదు, ఒకవేళ గ్యారెంటీ ఇచ్చి ఉంటే వాటిని రిపేర్ చేయించి నాణ్యతమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.