Take a fresh look at your lifestyle.

కరబూజ పై ఇండియా విన్ ఛాంపియన్ 2025 ఐసిసి ట్రోఫీ

గొల్లపల్లి, ముద్ర : కరబూజ పై భారతదేశ క్రికెట్ టోర్నమెంట్ ఐసీసీ ఛాంపియన్ షిప్ 2025 ట్రోఫీని చిత్రీకారించడాం జరిగిందని కళాకారుడు చోలేశ్వర్ తెలిపారు. దుబాయ్ లో ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచిన సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందినటువంటి ప్రముఖ సూక్ష్మ కళాకారుడు ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారి ఈ సందర్భంగా కరబుజా పై ఐసీసీ ఛాంపియన్ 2025 ట్రోఫీని చెక్కి దానిపై ఇండియా విన్ అని చిత్రీకరించడాం జరిగిందని ఆయన అన్నారు.ఈ విజయాన్ని అందిచినటువంటి ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వారి టీం కి అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపాడు.గతంలో భారతదేశ క్రికెట్ విన్నింగ్ కోసం రావి ఆకు పై చిత్రాన్ని చెక్కి అంకితం ఇచ్చాడు.ఇలాంటి మరెన్నో సుద్ధముక్కలపై ఆకులపై ఇలాంటి చిత్రాలు చెక్కి భారతదేశ విజయంలో పాల్గొన్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలిపారు. చోలేశ్వర్ చారి ఈ ఆర్ట్ ను చెక్కడాన్ని క్రికెట్ అభిమానులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.