Take a fresh look at your lifestyle.

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి : కౌన్సిలర్లు బర్రె పూజిత జహాంగీర్, జాలిగం విఘ్నేష్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని 22,23 వ వార్డుల కౌన్సిలర్లు బర్రె పూజిత జహంగీర్, జాలిగం విఘ్నేష్ మున్సిపల్ కమిషనర్ రామలింగంని కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బోర్లను ఫ్లషింగ్ చేపించి మోటార్లు బిగించాలని అలాగే సమావేశం పెట్టి వీధి దీపాలను, అత్యవసర అవసరాలకు ఉండే వాటిని ఎజెండాలో పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బర్రె నరేందర్, ఐలాపురం బాబు, కరకాల రమేష్, క్రాంతి, బాబు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.