Take a fresh look at your lifestyle.

పశువులకు విధిగా గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించాలి -జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి. వెంకన్న

 

ముద్ర… తుంగతుర్తి…..

తుంగతుర్తి మండల కేంద్రంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నివారణ, గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం కొనసాగుతున్న తీరును జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి. వెంకన్న శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు తుంగతుర్తి గ్రామంలో 1000 పశువులకు గాను 802 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను ఇచ్చినట్లు తెలిపారు. మిగతా పశువులకు కూడా త్వరలో గాలికుంటు వ్యాధి టీకాలు ఇవ్వన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క రైతు తమ పాడిపశువులకు వ్యవసాయ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించాలని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకిన పశు నిరసపడిపోయి క్షీణిస్తుందని తద్వారా మిగతా పశువులకు సైతం వ్యాధి సోకుతుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకక ముందే ముందు జాగ్రత్తగా టీకాలు ఇప్పించాలని డాక్టర్ వెంకన్న రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ బి. రవి ప్రసాద్,   గోపాల మిత్రులు లింగయ్య, శ్రీను, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.