Take a fresh look at your lifestyle.

అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన ముగ్గురికి 10 ఏళ్ల జైలు

 

ముద్ర, శేరిలింగంపల్లి :

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి కోర్టు తీర్పు వెలువరించిందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహేంద్ర ప్రసాద్ మిశ్రా (29), ధర్మేంద్ర ప్రసాద్ మిశ్రా (45), బీరేంద్ర ప్రసాద్ మిశ్రా (37) అన్నదమ్ములు మాదాపూర్ పరిధిలోని సిద్ధిక్‌నగర్‌లో అద్దె గదిలో నివాసం ఉండేవారు. 18 నవంబర్ 2016న వీరి మధ్య జరిగిన గొడవలో దేవేంద్ర ప్రసాద్ మిశ్రాపై ముగ్గురు నిందితులు కత్తి మరియు కిటికీ గాజు పలకతో దాడి చేశారు. ఈ దాడిలో దేవేంద్ర ప్రసాద్ మిశ్రా గొంతు వద్ద తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 701/2016గా కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అనంతరం పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో విచారణ పూర్తి చేసిన రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి కోర్టు ఆరవ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి సి. పావని నిందితులు ముగ్గురినీ దోషులుగా తేల్చి, ఒక్కొక్కరికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని డీసీపీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.