Take a fresh look at your lifestyle.

నారాయణపేట జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ అడిషనల్ కలెక్టర్ గా జి. పనిందర్ రెడ్డి

 

స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా సిక్త పట్నాయక్ బదిలీ

ముద్ర , నారాయణపేట:

నారాయణపేట జిల్లా కలెక్టర్ గా సుదీర్ఘకాలం కాలం పని చేసిన సిక్త పట్నాయక్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమె స్థానంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన ప్రతీక్ జైన్ నారాయణపేటకు కేటాయించింది. నారాయణపేట కలెక్టర్ గా బదిలీ అయిన ప్రతీక్ జైన్ 2017 బ్యాచ్ ఐఏఎస్ కాగ గతంలో భద్రాచలం ఐటీడీఏ (ITDA) ప్రాజెక్ట్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేశారు. నారాయణపేట నుంచి బదిలీ అయిన సిక్త పట్నాయక్ జిల్లాలో మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పవచ్చు. లాంగ్ స్టాండింగ్ నారాయణపేట పోస్టింగ్ కావడంతో ఈమెను సాధారణ బదిలీ లో భాగంగా స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోనున్నారు. అలాగే 2018 బ్యాచ్ ఐఏఎస్ పనిందర్ రెడ్డి ను నారాయణపేట అడిషనల్ కలెక్టర్ గా జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది.

Leave A Reply

Your email address will not be published.