కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పశువైద్య శాస్త్ర కళాశాలలో ఈ నెల 16న ఉపాధి అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ప్రముఖ అంతర్జాతీయ పశుసంబంధిత ఆహార తయారీ సంస్థ బెంటోలి భారత విభాగానికి చెందిన జాతీయ మేనేజర్ సంజీవ్ భరద్వాజ్, తెలుగు రాష్ట్రాల మేనేజర్ లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు కళాశాల విద్యార్థులకు ప్రైవేటు రంగంలో వెటర్నరీ పట్టభద్రుల కోసం ఉన్న వివిధ ఉద్యోగ, వ్యాపార, ఆవిష్కరణల అవకాశాల గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు. అంతర్జాతీయ అవకాశాలపై కూడా విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థుల్లో ఉద్యోగ అవగాహన పెరగడంతో పాటు భవిష్యత్తుపై స్పష్టత ఏర్పడింది. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ డా. దాసరి శ్రినివాస్ పర్యవేక్షణలో, ప్లేస్‌మెంట్ సెల్ అధికారి డా. రాధాకృష్ణ సమన్వయంతో నిర్వహించగా ప్రొఫెసర్లు డా. పల్లవి, డా. మోహిత లు కార్యక్రమ నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.
