- రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
- మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ నారాయణ రెడ్డి
ముద్ర ప్రతినిధి,ఉమ్మడి రంగారెడ్డి:మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.శుక్రవారం కొంగర కలాన్ జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మెషీలా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మాట్లాడుతూ మార్పు అనేది ఇంటి నుండే ప్రారంభం కావాలని అన్నారు.విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయని,భూమి పైన మాత్రమే ప్రాణం ఉన్న జీవులు జీవిస్తున్నాయని,అందులో మానవ జీవితం చాలా ఉత్తమమైందని తెలిపారు.ఆడ,మగా కలిసి ప్రయాణిస్తేనే అర్థం, పరమార్థం, స్త్రీ పురుషులిద్దరు ఒక బండికి జోడేద్దులుగా ప్రయాణం చేసినప్పుడే సమాజంలో ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నారు.కుటుంబానికి మూలం కుటుంబంలో ఉన్న మహిళా అని,కుటుంబంలోని ప్రతి విషయంలో మహిళ సమతుల్యత కలిగి ఉంటుందని అన్నారు.కొన్ని ప్రాంతాల్లో నేటికీ మహిళలను తక్కువగా చూడటం జరుగుచున్నదని,ఇప్పుడిప్పుడే మహిళలకు చదువుపరంగా,ఆర్థికపరమైన విషయాలలో సమానంగా అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు.అబ్బాయిలను అమ్మయిలను సమానంగా పెంచాలని,పిల్లలకు విలువలతో కూడిన విషయాలు నేర్పించాలని అన్నారు.కుటుంబం,కుటుంబంలోని బంధాలు,విలువలు మర్చిపోకుండా ఉన్నప్పుడే సమాజాన్ని కాపాడుకోగలమని అన్నారు.మహిళలు తమ ఆరోగ్యం పై శ్రద్ద తీసుకోవాలన్నారు.ప్రభుత్వం మహిళలకు అందించే ప్రతిఫలాలను మహిళలు అందిపుచ్చుకునేలా ప్రభుత్వరంగంలో ఉన్న మనందరం కృషి చేయాలన్నారు. జిల్లాలో 1/3 వంతు మహిళా అధికారులు పని చేస్తున్నారని,అందరూ బాగా పని చేస్తూ జిల్లాను ముందుకు తీసుకెళ్లడంలో మహిళా అధికారుల సహకారం ఎంతైన ఉందని తెలిపారు. మహిళలు ఏదైన సాధించగలరాని తెలిపారు.