రైతు భరోసా ఇవ్వాలంటూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
ముద్ర….. తుంగతుర్తి…..
యాసంగి సీజన్ మొదలై రైతులు సాగుకు సిద్ధమైన ఇప్పటివరకు అన్నదాతలకు రైతు భరోసా నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయనందుకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మెయిన్ రోడ్ పై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో పెట్టుబడి సాయం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, యాసంగిలో పంటలు సాగు చేసి అప్పుల ఊబి నుండి బయటపడదామన్న రైతులకు ప్రభుత్వం చేయూత ఇవ్వకపోవడంతో పంటలు సాగు చేద్దామా వద్దా అని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు, ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే పెట్టుబడి సాయం గా ఉపయోగపడుతుందని అన్నారు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీజన్ ప్రారంభం కాగానే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ అయ్యేదని దీంతో రైతులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని అన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా నిధులు రాక ఎరువులు సక్రమంగా అందకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు, అప్పు తెచ్చి పంట సాగుతో పాటు ఎరువులు కొనుగోలు చేద్దామంటే యూరియా దొరకడం లేదని అన్నారు, అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వడంతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇవ్వక రైతులను మోసం చేసిందని ఆరోపించారు, యాసంగి సీజన్లో రైతు భరోసా నిధులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో రైతులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలిగి ఉన్నారని అన్నారు, ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా రైతులకు తెలియజేయాలన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిందని అన్నారు, ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వక ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ పనికిరాని కేసులను వారిపై మోపి ఇబ్బందులు గురిచేస్తుందని అన్నారు, పేద రైతులు యూరియా బుక్ చేయాలంటే రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం వల్ల యూరియా బుక్ చేయలేకపోవడంతో రైతుల అవస్థలు పడుతున్నారని అన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా యాసంగి సీజన్ కు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొంగరి శ్రీను, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాజుల యాదగిరి, సర్పంచులు తప్పెట్ల ఎల్లయ్య, మాతంగి వెంకటమ్మ కర్ణాకర్, నాయకులు కొండగడుపుల నాగయ్య, పూర్ణా నాయక్, మల్యాల రాములు, గుడిపాటి వీరయ్య, కడారి దాసు, ఎస్ కే యాకూబ్, మట్టపల్లి వెంకట్, మల్లెపాక రాములు, జటంగి రవి, పాండవుల మహేష్, కరుణాకర్, భాస్కర్, గోపగాని రమేష్, సింహాద్రి, రమేష్, వెంకన్న, ఉప్పుల నాగమల్లు, సోమేశ్ తో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు