Take a fresh look at your lifestyle.

ఈనెల 27న వరంగల్లో జరగనున్న బి ఆర్ ఎస్ పార్టీ రజదోత్సవ సభను విజయవంతం చేయాలి

  • రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి, ముద్ర: వరంగల్ జిల్లాలో ఈనెల 27న బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రాల్లోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో రజదోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు .కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు ఓట్లు వేశారని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వెన్నుపోటు పొడిచింది అని అన్నారు.ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానం అమలు కాలేదని అన్నారు.కల్యాణ లక్ష్మి రైతు భరోసా రైతు రుణమాఫీ మహిళలకు ఇస్తానన్న ఆర్థిక సహాయం ఇలాంటి పథకాలు అడుగంటిపోయాయని అన్నారు. రైతులకు కావాల్సిన సాగునీరు అందించలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని దీంతో రైతులు ఎండిపోయిన పొలాలతో దీనస్థితిలో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలన నిలదీస్తూ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రజతోత్సవ సభకు లక్షలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ సాధకుడు తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న ఈ భారీ బహిరంగ సభ విజయవంతంతో కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని ఆ దిశగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చూడాలని కోరారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య జిల్లా నాయకులు కేతిరెడ్డి గోపాల్ రెడ్డి గుండ గాని రాములు గౌడ్ గాజుల యాదగిరి రమేష్ గౌడ్ గోపగాని శ్రీనివాస్ లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.