- తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు.
- ఎమ్మెల్యే సామేల్.
తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో గెలిచిన తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తాను నికార్సేన మనిషిని ఎవరితో లాలూచీ పడే అలవాటు లేదని గిట్టని వారు తనపై బురదల్లే కార్యక్రమం చేపట్టారని అన్నారు.అందులో భాగంగానే సోషల్ మీడియాలో తనపై అసత్య వీడియోలు పెడుతున్నారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ అసత్య ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.