Take a fresh look at your lifestyle.

ఆర్కే వన్ సమస్యలు పరిష్కరించాలి

  • సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఆర్కే వన్ సుభాష్ నగర్ అబివృద్దికి సహకరించాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోరారు. ఆదివారం మార్నింగ్ వాక్ లో భాగంగా పర్యటించిన మంత్రికి పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. గత 20 సంవత్సరాలుగా సుభాష్ నగర్ సమస్యలను అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వార్డుల్లో చెత్తను తరలించేందుకు పారిశుద్ధ్య కార్మికులతో పాటు చెత్త బండ్లను కేటాయించాలన్నారు. ఓపెన్ జిమ్,నూతన డ్రైనేజీలు,సిసి రోడ్లు,నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు,వాకింగ్ ట్రాక్,విద్యుత్తు లైట్లు,స్థంబాలు ఏర్పాటు చేయాలన్నారు.పట్టణ కార్యదర్శి శ్రీనివాస్, సంపత్, వెంకటస్వామి, గోపి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.