Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

  • ముఖ్యఅతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

అచ్చంపేట ముద్ర విలేఖరి:  నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలోని తుమ్మిన్ పేట్,కొత్తపల్లి, పోలిశెట్టి పల్లి, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమంలోఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అడ్వకేట్ రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కచ్చితంగా ఇస్తామని ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు.బల్మూరు మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలని లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులకు పట్టాలు అందజేసారు. అలాగే ఇండ్లకు భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనే ధృడ సంకల్పంతో పని చేస్తుందని, అచ్చంపేట నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో బల్మూర్ మండల పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, బల్మూరు మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్,జిల్లా నాయకులు కాశన్న యాదవ్, మున్సిపాల్ చైర్మన్ గార్లపాటిశ్రీనివాస్, సీనియర్ నాయకులు సుధాకర్ గౌడ్,ప్రకాష్ రెడ్డి,మోహన్ రెడ్డి,పోలిశెట్టి పల్లి గ్రామ అధ్యక్షుడు పరమేష్,అంజి,మురళి,స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.