కోరుట్ల, ముద్ర విలేకరి: త్రిశక్తి మాత ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలను గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిరహిస్తున్నారు. అందులో భాగంగా వారాహి మాత కు మంగళవారం రాత్రి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు జూలై 4 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని, అమ్మ వారిని రాత్రి వేళ పూజిస్తారని, సూర్యాస్త సమయములో పూజ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.ఈ సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గ మండలి గౌరవ అధ్యక్షులు కట్ట నారాయణ, అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి అడువాల ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్ కార్తీక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
