Take a fresh look at your lifestyle.

అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత

గొల్లపల్లి, ముద్ర విలేకరి : జగిత్యాల జిల్లా లోని గొల్లపల్లి మండలం శంకర్ రావు పేట గ్రామనికి చెందిన ఎడమల భోజెందర్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ పనిచేస్తున్న ఆయన తాను చదువుకున్న మల్లన్న పేట ఉన్నత పాఠశాల పైన మమకారంతో,గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మల్లన్న పేట ఉన్నత పాఠశాలలో 544 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచిన లక్కాకుల వైష్ణవికి 10000, వేల, 542 మార్కులతో రెండవ స్థానం సాధించిన చందనకు 5000 వేల ఇద్దరు విద్యార్థినిలకు ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.విద్యార్థుల చదువుకు పేదరికం ఎప్పటికీ అడ్డుకాదని ఆయన అన్నారు.భోజెందర్ రెడ్డి అందించిన నగదు ప్రోత్సాహకం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపుతూ భవిష్యత్తులో తాము ఇంకా బాగా చదువుకోవాలనే కృషి పెరుగుతుందన్నారు.గత మూడు సంవత్సరాల నుండి భోజేందర్ రెడ్డి మల్లన్నపేట పాఠశాలలో పదవ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఇదే విధంగా నగదు బహుమతి అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా భోజేందర్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శంకర్రావుపేట గ్రామ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, వారి బంధువులు మల్లారెడ్డి,కిషోర్,ఉపాధ్యాయులు కర్ణాకర్, రాజేశం, హరికృష్ణ,సత్య, రవీందర్, చంద్రశేఖర్,శరత్ చందర్,విజయ,ప్రకాష్,స్రవంతి, నందయ్య, రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.