ముద్ర కాప్రా
ఉప్పల్ లక్ష్మి నారాయణ కాలనీ లో శ్రీ మల్లెల మైసమ్మ ఆలయ పునఃనిర్మాణం , విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి పునఃనిర్మాణ కార్యక్రమాలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.