Take a fresh look at your lifestyle.

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

 

ముద్ర,గద్వాల:

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. గద్వాల మండలం సంగాల గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీర్తిశేషులు చెట్టుకింద పార్వతమ్మ జ్ఞాపకార్ధంగా గ్రామ సర్పంచ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ గ్రామ పెద్దలు అయ్యపు రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజశేఖర్, ఉప సర్పంచ్ చిట్టెమ్మ హనుమంతు రెడ్డి, వార్డు మెంబర్లు నవీన్, జగదీష్, వెంకట్ రాములు, గోవిందమ్మ, సవరన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామపెద్దలు అయ్యప్పు రెడ్డి నరసింహులు, భాస్కర్ రెడ్డి, కృష్ణయ్య, శేఖర్ రెడ్డి, రామకృష్ణ, వీరన్న, మైలారం శివరాములు, సత్య రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మధు రెడ్డి, పులి వీరన్న, చిన్న నరసింహులు, పాల నరసింహులు, యూత్ సభ్యులు నాగేష్, భీమేష్, ప్రవీణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.