ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పాఠశాలలో విద్యార్థుల భోజనం శుభ్రంగా, రుచికరంగా, పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు.
99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాల నేపథ్యంలో సోమవారం భువనగిరి కేంద్రంలో కేజిబివి బాలికల పాఠశాలను సందర్శించారు . మొదటి రోజు సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల వంట గదులు, పరిసరాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార నాణ్యత ను పరిశీలించారు. పాఠశాలలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూడాలన్నారు. వంటకు ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరుకులు నాణ్యతతో ఉండాలని తెలిపారు. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్యం పరిస్థితిని పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.