గ్రామ గ్రామాన, వాడవాడల ఎర్రజెండాలను ఎగరవేయాలి*
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలను కార్మికులు గ్రామ గ్రామాన వాడవాడల ఎర్రజెండాలు ఎగురవేయాలని మేడే వారోత్సవాల సందర్భంగా జరుగుతున్న క్రీడోత్సవాలను సాంస్కృతక కార్యక్రమాలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు సిద్దిపేట నియోజకవర్గం స్థాయి సమావేశం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి చుక్కారాములు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే మే ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన దినంగా మనం జరుపుకుంటున్నాం 1886 సంవత్సరానికి పూర్వం ప్రపంచవ్యాప్తంగా 18 గంటల పని విధానం అమల్లో ఉండేది నాడు కార్మిక వర్గం శ్రమ దోపిడి నుండి విముక్తి చేయడానికి మొట్టమొదటిసారిగా అమెరికా నడిబొడ్డులో హే మార్కెట్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భంగా వారిపై విరోచితంగా మార్పులు జరపడం మూలంగా ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు వారి స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాల్లోకి వచ్చారని దీన్ని చూసినా పెట్టుబడిదారు వర్గం వెనక్కి తగ్గి 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు ఆనాటి నుండి నేటి వరకు ఎనిమిది గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలవుతుంది నేడు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దుతో మేడే పోరాట స్ఫూర్తికి విగాదం కలిగించే పద్ధతిలో చట్టంలో మార్పు చేసిందని ఆనాటి పరిస్థితులే మళ్ళీ తిరిగి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుందని కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా పెట్టుబడుదారులకి మలచడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇలాంటి విధానాన్ని కార్మిక వర్గం ఐక్యతతో వెనక్కి కొట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల సందర్భంగా జరుగుతున్న క్రీడోత్సవాలు సంస్కృతిక కార్యక్రమాలను కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మేడే రోజున గ్రామ గ్రామాన వాడవాడల జెండా ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి జిల్లా సహాయ కార్యదర్శి మామిడాల కనకయ్య జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల కనకయ్య, వేముగంటి సాయిలు, లింగంపేట ఎల్లం హమాలి యూనియన్ నాయకులు అనారాజు ఎల్లయ్య బాలరాజు శ్రీనివాస్ రెడ్డి, స్వామి, బిక్షపతి, ఎల్లయ్య ,