Take a fresh look at your lifestyle.

తక్కువ కాల (స్వల్పకాలిక) మరియు మధ్యకాలిక రుణాలపై అవగాహన

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‌నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా బుధవారం కేటి దొడ్డి రైతు వేదికలో
తక్కువ కాల (స్వల్పకాలిక) మరియు మధ్యకాలిక రుణాలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ భూములపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయని రైతులకు తక్కువ కాల (Short Term) మరియు మధ్యకాల వ్యవసాయ రుణాలు పొందవచ్చు అని మండల వ్యవసాయ అధికారి‌ రాజవర్దన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశానికి వెంకటాపురంలోని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పాల్గొని, రైతులకు అందుబాటులో ఉన్న పంట రుణాలు, పశుసంవర్ధక రుణాలు, వ్యవసాయ ఉపకరణాల కొనుగోలుకు సంబంధించిన మధ్యకాల రుణాలపై సమగ్రంగా వివరించారు.

అలాగే రుణాల కోసం అవసరమైన పత్రాలు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు విధానం మరియు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల గురించి రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా సరైన రుణాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజవర్దన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) మరియు రైతులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.